బడ్జెట్‌లో జీఎస్టీ తగ్గింపును కోరుతున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగం!

by Disha Web Desk 17 |
బడ్జెట్‌లో జీఎస్టీ తగ్గింపును కోరుతున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగం!
X

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రకటన సమీపిస్తున్న తరుణంలో వివిధ రంగాల నుంచి ఆర్థిక మంత్రికి అభ్యర్థనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధి సాధిస్తున్న గేమింగ్ రంగంలో పన్నులను పరిశీలించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.

దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ వేగవంతంగా పుంజుకోవడంతో ప్రభుత్వం గేమింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం మరింత వృద్ధి సాధించేందుకు పరిశ్రమపై విధిస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించాలని కోరుతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి. అలాగే, మొత్తం ప్రైజ్ మనీపై కాకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్ కమీషన్‌లపై మాత్రమే జీఎస్టీని అమలు చేయాలని అభ్యర్థించారు.


Next Story

Most Viewed