OnePlus: 7300ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ 15 విడుదల

by S Gopi |

దేశీయంగా మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 72,999 నుంచి ఉండనుంది.

OnePlus: 7300ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ 15 విడుదల
X

దిశ, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15ను భారత మార్కెట్లో గురువారం విడుదల చేసింది. క్వాల్‌కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్5 ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 అని, సొంత డిటైల్‌మ్యాక్స్ ఇంజిన్‌తో ట్రిపుక్ 50ఎంపీ రేర్ కెమెరాతో ఇది వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16-ఆధారిత ఆక్సిజన్ ఓఎస్16తో పనిచేస్తుంది. దేశీయంగా మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 72,999 నుంచి ఉండనుంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి ఇది అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. 6.78 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్, అమోలెడ్‌ డిస్‌ప్లే, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో బ్రైట్‌నెస్ గరిష్టంగా 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. రాత్రిపూట వాడేందుకు వీలుగా 1 నిట్‌ వరకు బ్రైట్‌నెస్ పడిపోతుంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా 165 హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటు, పగటి పూట మెరుగైన విజిబిలిటీ కోసం సన్‌డిస్‌ప్లే టెక్నాలజీని వాడినట్టు కంపెనీ వివరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంటిపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా ఐ కంఫర్ట్ రిమైండర్, ఐ కంఫర్ట్ గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇతర ఫీచర్లకు సంబంధించి 12/16 జీబీ ర్యామ్‌తో 256జీబీ/512జీబీ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. 7,300ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 120వాట్స్ వైర్‌డ్ ఛార్జర్‌తో పాటు 50వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తుంది.

Next Story