హైదరాబాద్‌లో కొత్త స్టూడియో ప్రారంభించిన నెక్సియన్ ఇంటర్నేషనల్!

by Disha Web Desk 17 |
హైదరాబాద్‌లో కొత్త స్టూడియో ప్రారంభించిన నెక్సియన్ ఇంటర్నేషనల్!
X

హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ ప్రీమియం సిరామిక్ ఉత్పత్తుల సంస్థ నెక్సియన్ ఇంటర్నేషనల్ తెలంగాణలో తన కొత్త స్టూడియో 'కసియెంజా సిరామికా'ను గురువారం ప్రారంభించింది. దేశీయంగా తయారైన సిరామిక్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 35 కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్న నెక్సియన్ విస్తరణ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్త స్టూడియోను ప్రారంభించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన సంస్థ సేల్స్, మార్కెటింగ్ అధ్యక్షుడు దలీప్ దుడాని, హైదరాబాద్ మార్కెట్ సంస్థకు ఎంతో కీలకంగా ఉంది. కొత్త ఆవిష్కరణలకు, ఆర్కిటెక్ట్, డిజైనర్లకు సహకారం అందిస్తూ కొత్త టెక్నాలజీని ఉపయోగించి మార్బుల్, వుడ్, స్టోన్, కాంక్రీట్ శ్లాబ్ టైల్స్‌ను కంపెనీ అందిస్తుంది. అన్ని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని తయారు చేస్తున్నామని, ముఖ్యంగా ఇటాలియన్ ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించి మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు ఆయన వివరించారు.


Next Story

Most Viewed