మ్యాథ్స్ భయాన్ని పోగొట్టే 'భాన్జు'.. అత్యంత వేగవంతమైన హ్యూమన్‌ కాలిక్యులేటర్‌

by Disha Web Desk 17 |
మ్యాథ్స్ భయాన్ని పోగొట్టే భాన్జు.. అత్యంత వేగవంతమైన హ్యూమన్‌ కాలిక్యులేటర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సంస్థ అయిన అంతర్జాతీయ గణిత (మ్యాథ్‌) అభ్యాస వేదిక భాన్జు ను 2020 లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ (హ్యూమన్‌) కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందిన నీలకంఠ భాను ప్రకాష్‌ ప్రారంభించారు. నేడు ఈ సంస్థ 15 మిలియన్‌ డాలర్లను సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా సమీకరించినట్లు వెల్లడించారు. ఈ రౌండ్‌ ఫండ్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్ధ, ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌ నేతృత్వం వహించింది. ఈ రౌండ్‌లో మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ బీ క్యాపిటల్‌ సైతం పెట్టుబడులు పెట్టింది. ఈ సమీకరించిన నిధులను తమ సాంకేతిక మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంతో పాటుగా అసాధారణ విద్యార్థి అభ్యాస అనుభవాలను సృష్టించేందుకు, మరింత ఆసక్తికరంగా, ఫలితాలను లక్ష్యంగా చేసుకున్న కంటెంట్‌తో తమ గణిత పాఠ్యాంశాలు (మ్యాథ్‌ కరిక్యులమ్‌)ను బలోపేతం చేసేందుకు భాన్జు వినియోగించనుంది.

తెలంగాణాలోనే చూసుకుంటే, ఐదవ తరగతి విద్యార్ధులలో సైతం లెక్కలు పూర్తిగా వచ్చిన వారి సంఖ్య అతి తక్కువ. వారి గణిత ప్రదర్శన పరంగా చూస్తే అది కేవలం 35%గా ఉంటుందని 2021లో విడుదల చేసిన నేషనల్‌ ఎచీవ్‌ మెంట్‌ నివేదిక వెల్లడిస్తుంది. విద్యార్థులలో అపార సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పెర్‌ఫార్మెన్స్‌ నివేదిక దీనిని గుర్తించడం జరిగింది.


హైదరాబాద్‌ వాసి అయిన భాను, వ్యక్తిగతంగా సమగ్రమైన గణిత పాఠ్యాంశాలు సృష్టించడానికి ఇది స్ఫూర్తి కలిగించింది. గతంలో ఎన్నడూ గణితాన్ని ఆస్వాదించని విద్యార్థులు సైతం గణితాన్ని ఆస్వాదించేలా, గణితంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూనే సామాన్య శాస్త్రము (సైన్స్‌), గణితము (మ్యాథ్స్‌), భవిష్యత్‌లో ఇంజినీరింగ్‌ లో కెరీర్‌ పరంగా అత్యున్నత ప్రదర్శన చేసేందుకు తోడ్పడేలా దీనిని తీర్చిదిద్దారు.

భాన్జు వ్యవస్థాపకులు, సీఈవో నీలకంఠ భాను. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందారు. శకుంతల దేవి మ్యాథ్‌ రికార్డ్‌లను సైతం ఇతను బద్దలుకొట్టారు. 2020లో అతను యావత్‌ దేశానికి గర్వకారణంగా నిలుస్తూ మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌ వద్ద భారతదేశపు తరపున మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. ఆ తరువాత, భాన్జును భాను ప్రారంభించారు. ఇది గణిత అభ్యాస వేదిక. గణితమంటే ఉన్న భయాన్ని పోగొట్టే దిశగా ఇది కృషి చేస్తుంది.

ఈ ఫండింగ్‌ గురించి వేగవంతమైన హ్యూమన్‌ కాలిక్యులేటర్‌, భాన్జు సీఈఓ నీలకంఠ భాను మాట్లాడుతూ ''సరైన అభ్యాస పద్ధతులతో గణితాన్ని అభ్యసించే సామర్థ్యం మన దేశంలో ప్రతి చిన్నారికీ ఉందని నేను నమ్ముతున్నాను. నా గణిత పాఠ్యాంశాలు, విద్యార్థులకు గణితమంటే ఉన్న భయాన్ని పొగొట్టడంతో పాటుగా సైన్స్‌, ఇంజినీరింగ్‌ వంటి రంగాలలో కెరీర్‌లను ఎంచుకునేలా వారికి స్ఫూర్తినందిస్తుంది.

భారతదేశంలో ఆర్యభట్ట మొదలు రామానుజన్‌ నుంచి శకుంతల దేవి వరకూ గణిత మేధావులెందరో ఉన్నారు. ఊహాతీత సామర్థ్యాన్ని భారతీయ మేధావులు కలిగి ఉన్నారు. మరింత మంది భారతీయులు తమ అసలైన సామర్థ్యం గుర్తించేలా చేయాలని భాన్జు కోరుకుంటుంది. ఈ లక్ష్యం సాధించడానికి అత్యుత్తమ సామర్థ్యం గణితంకు ఉంది. భాన్జు గణిత కోర్సులతో, ప్రతి విద్యార్థి సరైన మార్గంలో గణితం అభ్యసించడం ప్రారంభించడం మాత్రమే కాదు, ఆ గణితాన్ని అభిమానిస్తారు'' అని అన్నారు.

ఈ కంపెనీ 6 నుంచి 16 సంవత్సరాల లోపు విద్యార్థులకు గణితంలో అభ్యాస కార్యక్రమాలను అందిస్తుంది. విద్యార్థులు నాలుగు రెట్లు వేగంగా, ఉత్తమంగా లెక్కలు చేసేందుకు విద్యార్థులకు సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు అభిజ్ఞా సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు అవసరమైన, సరైన పునాదిని వేయడంలో తోడ్పడుతుంది. భాన్జు పాఠ్యాంశాలను విస్తృత స్థాయి డేటా సేకరణ నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనల ఆధారంగా నీలకంఠ భాను వ్యక్తిగతంగా తీర్చిదిద్దారు. బాటమ్‌ అప్‌ విధానాన్నిరూపొందించడం ద్వారా గణిత అభ్యాసం పునాదిని ప్రశ్నించడం చుట్టూ ఇది తిరుగుతుంది.

విద్యార్ధులు ఎదుర్కొంటున్న భారీ సవాళ్లను భాన్జు పరిష్కరిస్తుంది. ప్రతి చిన్నారి ఆస్వాదించదగిన గణిత అభ్యాస అనుభవాలను అందిస్తుంది. వినూత్న అభ్యాస పద్ధతులతో గణితంపై ప్రేమను పెంపొందించడానికి, ప్రపంచంలోనే అత్యంత ఆలోచనాత్మకమైన, సంపూర్ణ గణిత పాఠ్యాంశంగా నిలిచేలా భాన్జు సృష్టించబడింది. మెంటల్‌ అధ్లెటిక్స్‌ విభాగంలో భారతదేశానికి దిక్సూచీలా భాను నిలిచారు. గణితాన్ని వినోదాత్మక క్రీడగా మలచడంతో పాటుగా దానిని ప్రధాన స్రవంతి సంస్కృతిలో అంతర్భాగం చేయడం ద్వారా గణితమంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి మన ముందున్న మార్గం, ప్రతి చిన్నారి సరైన మార్గంలో గణితాన్ని అభ్యసించేలా చేయాలి.

నీలకంఠ భాను – ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌

భారతీయ గణిత విద్య – సాంకేతిక వేదిక భాన్జు, వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందిన నీలకఠ భాను ప్రకాష్‌. ప్రపంచవ్యాప్తంగా గణిత అభ్యాస అనుభవాలను సమూలంగా మార్చాలన్నది ఆయన లక్ష్యం. 17 సంవత్సరాల వయసులోనే అతను శకుంతల దేవి లాంటి గణిత మేధావి రికార్డులను చెరిపి వేశారు. అక్కడితో భాను ఆగలేదు. తన అసాధారణ సామర్థ్యంను మరింతగా ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.

లండన్‌ లో జరిగిన మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌ వద్ద మెంటల్‌ చాంఫియన్‌షిప్‌ 2020లో గోల్డ్‌ మెడల్‌ అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, ఆసియన్‌గా ఖ్యాతి గడించి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మరెంతో మంది అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలనూ పొందారు. ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచిన భాను, తన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు రావడంతో పాటుగా అభిజ్ఞా పాఠ్యాంశాలను తీర్చిదిద్దారు. ఇది గణిత అభ్యాసాన్ని మరింత వినోదాత్మకంగా మలచడం తో పాటుగా విద్యార్థులకు ఆసక్తికరంగానూ ఉంటుంది.

భాను ఇప్పటికి 23 దేశాలను సందర్శించడంతో పాటుగా 1000కు పైగా క్లాస్‌లను బోధించి 2 మిలియన్‌లకు పైగా విద్యార్థులపై ప్రభావం చూపారు. గణితాన్ని ఓ క్రీడగా ప్రచారం చేశారు. నాలుగు ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్‌ రికార్డులను 2014, 2015,2016 లలో పలు విభాగాల్లో పగలగొట్టారు. ఇండియా యూత్‌ ఐకాన్‌ 2020 అవార్డును నేషనల్‌ యూత్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి భాను గెలుచుకున్నారు. ఫోర్బ్స్ ఆసియా 2022 30 అండర్ 30 కన్స్యూమర్ టెక్నాలజీ విభాగంలో కూడా భాను ఫీచర్ చేయబడ్డాడు.

భాన్జు గురించి

గణిత అభ్యాస వేదిక భాన్జు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌ నీలకంఠ భాను ప్రకాష్‌ దీనిని ప్రారంభించారు. అత్యంత ఖచ్చితత్త్వంతో డిజైన్‌ చేసిన పాఠ్యాంశాలతో తీర్చిదిద్దబడిన గణిత అభ్యాస వేదిక భాన్జు. ఇది విద్యార్థులు నాలుగు రెట్లు వేగంగా గణితం చేసేందుకు తోడ్పడటం తో పాటుగా వారి అభిజ్ఞా సామర్ధ్యాలు పెంపొందించడం, వారి కీలకమైన గణిత చతురతను పెంపొందించడం ద్వారా గణితంలో వారు మెరుగ్గా రాణించేందుకు సహాయపడుతుంది. భాన్జు యొక్క పాఠ్యాంశాలను విస్తృత స్ధాయి డాటా సేకరణ మరియు నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనల ఆధారంగా నీలకంఠ భాను వ్యక్తిగతంగా తీర్చిదిద్దారు.

బాటమ్‌ అప్‌ విధానాన్ని రూపొందించడం ద్వారా గణిత అభ్యాసం యొక్క పునాదిని ప్రశ్నించడం చుట్టూ ఇది తిరుగుతుంది. వ్యక్తిగతీకరించిన పద్ధతిని ఉపయోగించి అత్యంత ఆలోచనాత్మకమైన ప్రణాళికలను రూపొందించాలన్నది భాన్జు లక్ష్యం. ఇది విద్యార్ధులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటుగా వాస్తవ ప్రపంచంలో గణితాన్ని వారు వినియోగించేలా తోడ్పడుతుంది. 2020లో తెలంగాణా ప్రభుత్వానికి అధికారిక గణిత విద్య భాగస్వామిగా భాన్జు చేతులు కలిపింది. కొవిడ్‌ 19 మహమ్మారి కాలంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులను ప్రాజెక్ట్‌ ఇన్ఫినిటీ మరియు ప్రాజెక్ట్‌ మ్యాథ్‌ ద్వారా లాక్‌డౌన్‌ సమయాలలో చేరింది.


Next Story

Most Viewed