5 నెలల వయసులో రూ.4.2 కోట్లు సంపాదించిన నారాయణ మూర్తి మనవడు

by Disha Web Desk 17 |
5 నెలల వయసులో రూ.4.2 కోట్లు సంపాదించిన నారాయణ మూర్తి మనవడు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రెండో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు ఏకగ్రాహ్ రోహన్ మూర్తి కేవలం 5 నెలల వయస్సులో దాదాపు రూ.4.2 కోట్లు సంపాదించాడు. అది ఎలాగంటే, ఇన్ఫోసిస్ గురువారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దీంతో తన షేర్ హోల్డర్‌కు తుది డివిడెండ్ ఒక్కో షేరుకు రూ.28 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌‌లో నారాయణ ముర్తి 1.51 కోట్ల షేర్లను కలిగి ఉండగా, వాటిలో 15 లక్షల షేర్లను గత నెల తన మనవడు ఏకగ్రాహ్ రోహన్ మూర్తికి బహుమతిగా ఇచ్చారు. ఈ షేర్లకు అనుగుణంగా ఇప్పుడు కంపెనీ ప్రకటించిన డివిడెండ్‌ రూపంలో 5 నెలల వయస్సులో రోహన్ రూ.4.2 కోట్లు సంపాదించనున్నాడు.

తాత ఇచ్చినటువంటి షేర్లతో రోహన్ ఇన్ఫోసిస్‌లో 0.04 శాతం వాటా కలిగి ఉన్నాడు. ఈ షేర్ల విలువ దాదాపు రూ.210 కోట్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ చిన్నారి భారత్‌లో అత్యంత చిన్న వయస్కుడైన మిలియనీర్ల జాబితాలో చోటుదక్కించుకున్నాడు. నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు.. కూతురు అక్షతా మూర్తి, ఈమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య. కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌ల కుమారుడే ఈ ఏకగ్రాహ్ రోహన్ మూర్తి. జనవరి నుండి మార్చి త్రైమాసికంలో, ఇన్ఫోసిస్ నికర లాభం మార్కెట్ అంచనాలను అధిగమించి 30 శాతం లాభంతో రూ. 7,975 కోట్లను నమోదు చేసింది.

Next Story

Most Viewed