ఎలక్ట్రిక్ వాహనాలలో లోపాలు.. చర్యలకు ఆదేశం

by Disha Web Desk 17 |
ఎలక్ట్రిక్ వాహనాలలో లోపాలు.. చర్యలకు ఆదేశం
X

ముంబై: వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల(EV)లో అగ్ని ప్రమాదాలు జరగడం పై దృష్టి పెట్టిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఇటీవల కమిటీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (BMS), సెల్ వెంటింగ్ మెకానిజంలో తీవ్రమైన లోపాన్ని గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ (MoRTH) పేర్కొంది. కమిటీ సిఫార్సుల ఆధారంగా, నాసిరకం వాహనాలను విక్రయించినందుకు దోషులుగా తేలిన ముగ్గురు ఎలక్ట్రిక్ వాహనాల(EV) తయారీదారులపై భారీ జరిమానాలు విధించాలని రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది.

ఇటీవల రద్దీగా ఉండే వీధిలో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. తమిళనాడులోని వెల్లూరులో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కారణంగా మరో ఈ-బైక్ దగ్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు మొగ్గు చూపుతున్న తరుణంలో ఇలా వరుసగా EVలు దగ్ధం అవుతున్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయని, అంతేకాకుండా ఈ ప్రమాదాలు తయారీలోని లోపాలను తెలుపుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

వరుస ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం వంటి ఘటనల తర్వాత రవాణా మంత్రి నితిన్ గడ్కరీ EV కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. నిర్లక్ష్యానికి పాల్పడితే భారీ జరిమానాలు, నిర్లక్ష్యానికి పాల్పడినట్లు తేలితే వాటిని తప్పనిసరిగా రీకాల్ చేస్తామని హెచ్చరించారు. "గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అనేక ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయడానికి కూడా ఆదేశించడం జరుగుతుందని" గడ్కరీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

వరుస అగ్నిప్రమాదాల విషయంలో తొందరగా చర్యలు తీసుకోవాలని EV తయారీదారులను రవాణా మంత్రి కోరారు. ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే బ్యాటరీల్లో భద్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి రవాణా మంత్రిత్వ శాఖ త్వరలో నిబంధనలను జారీ చేయనుందని తెలిపారు.


Next Story

Most Viewed