'స్వచ్ఛ్ భారత్' గేమ్‌ను అభివృద్ధి చేయండి: మోడీ

by Disha Web Desk 17 |
స్వచ్ఛ్ భారత్ గేమ్‌ను అభివృద్ధి చేయండి: మోడీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాని మోడీ భారతీయ అగ్రశ్రేణి గేమర్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సామాజిక సమస్యలను పరిష్కరించే గేమ్‌లను తయారు చేయాలని, 'స్వచ్ఛ్ భారత్' ఆధారంగా ఒక గేమ్‌ను అభివృద్ధి చేయాలని గేమర్‌లను మోడీ కోరారు. ఇంటరాక్షన్‌లో భాగంగా గేమింగ్ నియంత్రణ, సృజనాత్మక అభివృద్ధి, సామాజిక అవగాహనను పెంపొందించడంలో గేమింగ్ పాత్ర పోషించాల్సిన అంశాలపై వారితో మోడీ చర్చించారు. అలాగే, గేమింగ్, జూదం మధ్య వ్యత్యాసం, గేమింగ్ పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం మరిన్నింటి గురించి కూడా చర్చించారు. గేమర్‌లు తమ సమస్యలన్నింటినీ తన కార్యాలయానికి తెలియజేస్తూ ఈ-మెయిల్ పంపాలని కూడా ఆయన కోరారు.

భారత గేమింగ్ పరిశ్రమ విశేషమైన అభివృద్ధిని సాధించింది. భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఆటలు బాగా గుర్తింపు పొందాయి. గేమింగ్‌ పరిశ్రమను భారతదేశ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థీకృత, చట్టపరమైన నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం దానిని సమీక్షిస్తుంది, ఇది ప్రభుత్వ ప్రాథమిక స్వభావం అని మెడీ అన్నారు. మొబైల్ గేమింగ్ ఆధిపత్యం ఉన్నప్పటికీ, లీగ్ ఆఫ్ లెజెండ్స్ వంటి PC టైటిల్స్ ప్రపంచ వేదికపై భారతదేశం పోటీ స్ఫూర్తిని ప్రదర్శించాయని ప్రధాని ప్రశంసించారు. ఇంటరాక్షన్‌లో పాల్గొన్న ప్రసిద్ధ భారతీయ గేమర్‌లలో అనిమేష్ అగర్వాల్, నమన్ మాథుర్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, తీర్థ్ మెహతా, గణేష్ గంగాధర్, అన్షు బిష్త్ ఉన్నారు.

Next Story