- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M&M: కస్టమర్లకు బిగ్ షాక్.. కార్ల ధరలను పెంచిన మహీంద్రా..!
కార్లు కొనాలనుకునే వారికి కంపెనీలు షాక్ ఇస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కార్లు కొనాలనుకునే వారికి కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. దేశీయ వాహన మార్కెట్లో కార్ల ధరలను పెంచుతున్నాయి. ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్(Mercedes Benz), ఆడి(Audi), హ్యుందాయ్(Hyundai) సంస్థలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా మహీంద్రా&మహీంద్రా(M&M) కూడా పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. జనవరి 1 నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్(Exchange Filing)లో తెలిపింది. ద్రవ్యోల్బణం(Inflation), ముడి పదార్థాల ధరలు(Raw Materials prices), ఉత్పత్తి వ్యయాలు(Production Costs) పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో కొంత భారాన్ని వినియోగదారుల(Customers)పై వేయక తప్పడం లేదని వెల్లడించింది. కాగా నిన్న మారుతీ సుజుకీ అన్ని మోడళ్లపై 4 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. త్వరలో మిగిలిన కంపెనీలు కూడా కార్ల ధరలను పెంచే అవకాశముంది.






