డిసెంబర్‌లో 9.8 శాతానికి పెరిగిన ఖనిజ ఉత్పత్తి సూచిక

by Disha Web Desk 17 |
డిసెంబర్‌లో 9.8 శాతానికి పెరిగిన ఖనిజ ఉత్పత్తి సూచిక
X

న్యూఢిల్లీ: మైనింగ్ రంగం సానుకూల వృద్దిని కనబరుస్తూ ఖనిజ ఉత్పత్తి సూచిక 2022 డిసెంబర్‌లో 9.8 శాతానికి పెరిగింది. గనుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. డిసెంబర్‌లో మైనింగ్ కార్యకలాపాలు ఊపందుకోవడం, క్వారీ రంగానికి సంబంధించి ఖనిజ ఉత్పత్తి పెరగడం వలన గత ఏడాది కంటే వృద్ధి శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.

గణాంకాల ప్రకారం, గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్‌‌తో పోలిస్తే సంచిత వృద్ధి ప్రస్తుతం ఇదే కాలంలో 5.4 శాతంగా ఉంది. డిసెంబర్‌లో అన్ని ఖనిజాల ఉత్పత్తి భారీగా పెరిగింది. ముఖ్యంగా, బాక్సైట్ 2272 వేల టన్నులు, బొగ్గు 833 లక్షల టన్నులు, లిగ్నైట్ 35 లక్షల టన్నులు, ముడి పెట్రోలియం 25 లక్షల టన్నులు, బంగారం 174 కిలోలు, ఇనుప ఖనిజం 251 లక్షల టన్నులు, మాంగనీస్ 307,000 టన్నులు, సున్నపురాయి 355 లక్షల టన్నులుగా ఉన్నాయి.

Next Story

Most Viewed