రైలు ఘటన బాధితులకు అండగా ఎల్ఐసీ!

by Dishafeatures2 |
రైలు ఘటన బాధితులకు అండగా ఎల్ఐసీ!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా బీమా క్లెయిమ్ చేసుకునేందుకు డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయిస్తూ, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సుల్భతరం చేస్తున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. జరిగిన ఘటన ఎంతో బాధించిందని, ప్రమాదంలో బాధితులుగా నిలిచిన వారిని ఆదుకునెందుకు ఎల్ఐసీ కట్టుబడి ఉందని, వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్లను వేగవంతంగా నిర్వహించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్‌దారులతో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుల ఇబ్బందులను తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్‌కు బదులుగా రైల్వే విభాగం, పోలీస్, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాధికారుల నుంచి మరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను రుజువుగా అంగీకరిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా, క్లెయిమ్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు, సలహాల కోసం డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.


Next Story

Most Viewed