తాజా తొలగింపులు చేపట్టిన అమెజాన్ ఇండియా!

by Disha Web Desk 17 |
తాజా తొలగింపులు చేపట్టిన అమెజాన్ ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన అమెజాన్ వెబ్ సర్విసెస్(ఏడబ్ల్యూఎస్), పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్(పీఎక్స్‌టీ) విభాగాల్లో తాజా తొలగింపులను చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో కంపెనీ సీఈఓ యాండీ జస్సీ ప్రకటించిన 9,000 మంది తొలగింపుల్లో భాగంగానే ఈ లేఆఫ్ జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ రౌండ్ తొలగింపు వల్ల సుమారు 400-500 మంది ఉద్యోగులు ప్రభావితం అవనున్నారు. అంతేకాకుండా పీఎక్స్‌టీ విభాగంలో గతవారం చివరలోనూ దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల మధ్య పీఎక్స్‌టీ విభాగం ఖర్చుల భారాన్ని కలిగి ఉందని, అందుకే ఈ విభాగంలో ఎక్కువ తొలగింపులు చేపట్టినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

అలాగే, డేటా మేనేజ్‌మెంట్ విభాగంలో 80 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. కంపెనీ నుంచి బీమా సౌకర్యాన్ని పొందుతామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఏడబ్ల్యూఎస్ విభాగంలో ఆదాయం తగ్గడం, ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు తొలగింపులు చేపడుతున్నట్టు ఏడబ్ల్యూఎస్ సీఈఓ ఆడమ్ సెలిప్‌స్కీ ఏప్రిల్ చివర్లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed