ఉద్యోగుల తొలగింపు బాటలో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'కూ'!

by Disha Web Desk 17 |
ఉద్యోగుల తొలగింపు బాటలో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ!
X

బెంగళూరు: దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'కూ' ఆర్థిక నష్టాలతో పాటు కొత్తగా నిధుల సేకరణలో ఇబ్బందుల కారణంగా దాదాపు మూడో వంతు ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. భారత్‌లో మార్కెట్ వాటా కోసం ట్విట్టర్‌తో పోటీ పడుతున్న కూ సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా కోల్పోతోంది. ఈ క్రమంలో ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమించేందుకు సుమారు 260 మంది ఉద్యోగులను (30 శాతం) ఇంటికి పంపినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

దీనిపై స్పందించిన కంపెనీ ప్రతినిధి ఒకరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వృద్ధి కంటే సామర్థ్యంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయని, ఆదాయ-వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించడంపై పని చేస్తున్నాయన్నారు. గతేడాది కూడా కంపెనీ 15 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

మూడేళ్ల క్రితం ప్రారంభమైన కూ, మొదట్లో ట్విట్టర్‌కు, భారత ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన ప్రతికూల చర్చల ద్వారా లాభపడింది. ఆ సమయంలో చాలామంది ట్విట్టర్‌ను వీడి కూలో ఖాతాలను తెరిచారు. అయితే, అనంతర పరిణామాల్లో కంపెనీ నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది.

Also Read..

ఈసారి అక్షయ తృతీయకు పసిడి అమ్మకాలు డౌటే!


Next Story

Most Viewed