భారం కానున్న ఇండస్ఇండ్, ఆర్‌బీఎల్ బ్యాంకుల రుణాలు!

by Disha Web Desk 6 |
భారం కానున్న ఇండస్ఇండ్, ఆర్‌బీఎల్ బ్యాంకుల రుణాలు!
X

న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ల(ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించాయి. దీంతో ఈ బ్యాంకుల్లో తీసుకునే గృహ, వ్యక్తిగత,వాహన, ఇతర వ్యాపార రుణాలపై వడ్డీ మరింత భారం కానుంది. ఈ నెలాఖరులో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమావేశం(ఎంపీసీ) జాగనున్నట్టు నేపథ్యంలో బ్యాంకులు తమ కీలక రుణాల రేట్లను పెంచాయి. తాజా వివరాల ప్రకారం, ఇండస్ఇండ్ బ్యాంకు తమ ఎంసీఎల్ఆర్‌ను 5-10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీంతో బ్యాంకు నిర్దేశించిన ఓవర్‌నైట్ నుంచి మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ రేటు 8.30 శాతం నుంచి 9.80 శాతం మధ్య ఉంటుంది. అలాగే, ఆర్‌బీఎల్ బ్యాంకు సైతం అన్ని కాలవ్యవధులపై రుణ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని ద్వారా ఓవర్‌నైట్ నుంచి ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉండనుంది. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం వచ్చే వారంలో జరగనుంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఏడాది మే నుంచి వరుస సమావేశాల్లో ఆర్‌బీఐ కీలక రెపో రేటును 140 బేసిస్ పాయింట్లను పెంచింది. రానున్న సమావేశంలోనూ మరోసారి పెంపు ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కీలక రుణ రేట్లను సవరిస్తున్నాయి.


Next Story

Most Viewed