రష్యా నుంచి రికార్డు స్థాయిలో పెరిగిన చమురు దిగుమతి!

by Disha Web Desk 13 |
రష్యా నుంచి రికార్డు స్థాయిలో పెరిగిన చమురు దిగుమతి!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా భారత్‌కు ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఇది మన దిగుమతి చేసుకునే మొత్తం చమురులో 35 శాతం వాటాకు సమానం. అంతేకకుండా ఇరాక్, సౌదీల నుంచి వచ్చే దిగుమతుల కంటే ఎక్కువ కావడం విశేషం. ఇంధన సరఫరా వివరాలను వెల్లడించే వోర్టేక్సా డేటా ప్రకారం, భారత్‌కు ముడి చమురు సరఫరా చేసే దేశాల జాబితాలో రష్యా వరుసగా ఐదవ నెల కూడా అగ్రస్థానంలో ఉంది. దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ సరఫరా రష్యా నుంచి వచ్చింది.

గతేడాది మార్చి ఆఖరు నాటికి భారత్ ప్రతి ఏడాది దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమే ఉండేది. ఏడాది కాలంలో ఇది రోజుకు 16 లక్షల బ్యారెళ్లకు పెరగడం గమనార్హం. 2022, నవంబర్‌లో రష్యా నుంచి 9.09 లక్ష్ల బ్యారెళ్లు, అక్టోబర్‌లో 9.34 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. మొదటిసారిగా అక్టోబర్‌లో రష్యా ఇరాక్, సౌదీల కంటే ఎక్కువ ముడి చమురును భారత్‌కు సరఫరా చేసింది. యూరప్ సమాఖ్య రష్యా నుంచి జలమార్గంలో సరఫరా అయ్యే చమురుపై పరిమితిని విధించడంతో బ్యారెల్ ధర 60 డాలర్ల కంటే తక్కువకు మన దిగుమతి చేసుకుంటున్నాం. ఈ కారణంగానే రష్యా నుంచి భారత్ చమురు దిగుమతిని పెంచింది.


Next Story

Most Viewed