8 నెలల గరిష్ఠానికి తయారీ కార్యకలాపాలు

by Dishanational1 |
8 నెలల గరిష్ఠానికి తయారీ కార్యకలాపాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చిలో భారత వ్యాపార కార్యకలాపాలు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. ఆర్థికవ్యవస్థ వృద్ధి అత్యంత వేగంగా ఉండటమే దీనికి కారణం. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఆధ్వర్యంలో రూపొందించిన హెచ్ఎస్‌బీసీ ఫ్లాష్ ఇండియా కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) ఫిబ్రవరిలో 60.6 పాయింట్ల నుంచి ప్రస్తుతం 61.3 పాయింట్లకు పెరిగింది. దేశంలో దాదాపు మూడున్నరేళ్లలోనే బలమైన తయారీ కారణంగా పీఎంఐ సూచీ అత్యంత సానుకూలంగా ఉందని హెచ్ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ ప్రంజూల్ భండారి చెప్పారు. సంస్థలకు కొత్త ఆర్డర్లు మునుపటి నెలల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దేశీయంగానే కాకుండా ఎగుమతి ఆర్డర్లు రెండూ అధికంగానే ఉన్నాయని ప్రంజూల్ తెలిపారు. కొత్త ఆర్డర్లలో ప్రధానంగా ఫ్యాక్టరీ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.


Next Story

Most Viewed