India Exports: ఈ ఏడాదిలో 900 బిలియన్ డాలర్లు దాటనున్న దేశ వస్తు, సేవల ఎగుమతులు

by S Gopi |

భారత వస్తువులు, సేవల ఎగుమతులు రూ. 77 లక్షల కోట్లను దాటుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

India Exports: ఈ ఏడాదిలో 900 బిలియన్ డాలర్లు దాటనున్న దేశ వస్తు, సేవల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా వాణిజ్యం, ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వస్తువులు, సేవల ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల(రూ. 77 లక్షల కోట్ల)ను దాటుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఎర్ర సముద్రం సంక్షోభం కారణంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ, 2023-24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదైన తర్వాత, 2024-25లో దేశ మొత్తం ఎగుమతులు 825 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది దానికి మించి అత్యధిక ఎగుమతులను సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. భారత్-స్విస్ ఆర్థిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఈ ఏడాది ప్రారంభంలో భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ) మధ్య జరిగిన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (టీఈపీఏ) అమలు కోసం పీయుష్ గోయల్ స్విట్జర్లాండ్‌కు రెండు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్‌లో అధికారిక పర్యటనల తర్వాత, భారత ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎగుమతులపై స్పందించారు.

Next Story