6జీని అందుకోవడంలో భారత్‌ ముందంజ: టెలికాం మంత్రి!

by Disha Web Desk 21 |
6జీని అందుకోవడంలో భారత్‌ ముందంజ: టెలికాం మంత్రి!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో.. భారత్ తర్వాతి జనరేషన్ నెట్‌వర్క్ అయిన 6జీని అందుకోవడంలో ముందడుగు వేస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ దశాబ్దం చివరి నాటికి 6జీని కూడా మొదలుపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని మోదీ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన అశ్విని వైష్ణవ్, ప్రధాని కోరిక మేరకు 6జీలో భారత్ ముందంజ వేస్తుందన్నారు.

5జీ ద్వారా విద్య, ఆరోగ్యం, వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో కొత్త అవకాశాలకు మార్గాలు తెరుచుకుంటాయని, రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ అందించాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. 5జీ నెట్‌వర్క్‌తో వినియోగదారులకు అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ అందించడమే కాకుండా విపత్తులను ఎదుర్కొనేందుకు వ్యవసాయం వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. 5జీ సేవలు రాబోయే ఆరు నెలల్లో 200 నగరాల్లో అందుబాటులోకి వస్తాయని, రెండేళ్లలో దేశంలోని 80-90 శాతం మంది ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.


Next Story

Most Viewed