సెమీకండక్టర్ సరఫరా అభివృద్ధికి భారత్, యూఎస్ మధ్య అవగాహన ఒప్పందం!

by Disha Web Desk 17 |
సెమీకండక్టర్ సరఫరా అభివృద్ధికి భారత్, యూఎస్ మధ్య అవగాహన ఒప్పందం!
X

న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల సరఫరా, ఇన్నోవేషన్ కోసం భారత్, యూఎస్ శుక్రవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆహ్వానం మేరకు యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రెమొండొ ఈ నెల 7-10వ తేదీల్లో ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పెంచేందుకు శుక్రవారం సమావేశం జరిగింది.

ఇందులో భాగంగానే సెమీకండక్టర్ల సరఫరా, ఇన్నోవేషన్ భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన చిప్స్, సైన్స్ యాక్ట్, భారత్‌కు చెందిన సెమీకండక్టర్ మిషన్ లక్ష్యాలను నెరవేర్చేలా సెమీకండక్టర్ల సరఫరా, ఇన్నోవేషన్ కోసం రెండు ప్రభుత్వాల మధ్య సహకార యంత్రాంగం ఏర్పాటుకు ఎంఓయూ సహకరిస్తుంది. అవగాహన ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సెమీకండక్టర్ల డిజైన్, తయారీ, ఫ్యాబ్రికేషన్ అభివృద్ధికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అలాగే, గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా కోసం నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సృష్టికి, ఆర్అండ్‌డీ కోసం జాయింట్ వెంచర్‌ల ఏర్పాటు, టెక్నాలజీ భాగస్వామ్యాల అభివృద్ధిని ప్రోత్సహించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ ఒప్పందంతో భారత సెమీకండక్టర్ మిషన్‌కు సహాయపడుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

Also Read..

సెమీకండక్టర్ సరఫరా అభివృద్ధికి భారత్, యూఎస్ మధ్య అవగాహన ఒప్పందం!

Next Story

Most Viewed