బాలయ్య బ్యాగ్‌లో ఆ బాటిల్ ఉండాల్సిందే! భరత్ సెన్సేషనల్ కామెంట్స్..

by Disha Web Desk 18 |
బాలయ్య బ్యాగ్‌లో ఆ బాటిల్ ఉండాల్సిందే! భరత్ సెన్సేషనల్ కామెంట్స్..
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై మాటలు తూటల్లా పేలుతున్నాయి. ఇక కూటమి పార్టీల ప్రచారంలో సినీ నటులు హోరెత్తిస్తున్నారు. సీనియర్ హీరో నటసింహం బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన చిన్న అల్లుడు భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మామయ్య(బాలకృష్ణ) ఎక్కడికి వెళ్లిన తన బ్యాగులో ఎప్పుడూ ఓ బాటిల్ తనతోనే తీసుకేళ్తాడని అన్నారు. వివరాల్లోకి వెళితే..బాలయ్య మద్యం అలవాటు విషయమై చాలా సందర్భాల్లో ఆయనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాలయ్య కేవలం ఒక బ్రాండ్ మాత్రమే వాడతాడంట.

ఈ క్రమంలో బాలయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతారనే విషయాన్ని ఆయన ఫ్యాన్స్ ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. దాన్ని బాలయ్య బ్రాండ్‌గా పిలుచుకుంటారు. తాజాగా శ్రీభరత్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ.. మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని తెలిసిన తర్వాత ఆ కంపెనీ స్టాక్ విలువ పెరిగిందన్నారు. వేడినీళ్లలో కలుపుకొని తాగుతారు కదా అని యాంకర్ అడగింది. అప్పుడు భరత్ అవును అది నిజం అన్నారు. బాలయ్య దగ్గర ఎప్పుడూ ఓ బ్యాగ్ ఉంటుందని, అందులో మందు సీసా తో పాటు వేడి నీళ్లు కూడా ఉంటాయని, ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే. అమెరికా వెళ్లినా దాన్ని వెంట తీసుకు వెళతారని భరత్ చెప్పారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed