ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉందా.. అయితే మీకు శుభవార్తే!

by Disha Web Desk 17 |
ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉందా.. అయితే మీకు శుభవార్తే!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని కాలవ్యవధులపై 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఎఫ్‌డీలపై సవరించిన వడ్డీ రేట్లు సోమవారం(సెప్టెంబర్ 26) నుంచే అమలవుతాయని పేర్కొంది.

బ్యాంకు వివరాల ప్రకారం, 7 రోజుల 29 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 2.75 శాతం వడ్డీ అందిస్తుండగా, 30-90 రోజుల ఎఫ్‌డీలపై 3.25 శాతం, 91-184 రోజుల ఎఫ్‌డీలపై 3.75 శాతం నుంచి 4 శాతానికి వడ్డీ లభిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాది కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై 4.65 శాతం, 1-2 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.50 శాతం, 2-3 ఏళ్ల ఎఫ్‌డీలపై 5.60 శాతం వడ్డీ అమలు కానుంది.

అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. వారికి గరిష్ఠంగా 6.60 శాతం వడ్డీ అందుతుంది.


Next Story

Most Viewed