మరింత భారం కానున్న HDFC లోన్స్!

by Disha Web Desk 17 |
మరింత భారం కానున్న HDFC లోన్స్!
X

ముంబై: ప్రముఖ తనఖా రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్(ఆర్‌పీఎల్ఆర్) పెంచుతున్నట్టు ప్రకటించింది. మార్చి 1 నుంచి అమలయ్యేలా ఆర్‌పీఎల్ఆర్ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్‌పీఎల్ఆర్ పెరుగుద‌ల వల్ల గృహ రుణ గ్ర‌హీత‌లు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల క్రెడిట్ స్కోర్, రుణ మొత్తంపై ఆధారపడి వడ్డీ రేట్లలో మార్పు ఉంటాయని సంస్థ వెల్లడించింది.

సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం, 760 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వినియోగదారులకు 8.70 శాతం వడ్డీకి రుణాలు లభించనున్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం అధిక స్థాయిలో ఉండ‌టంతో ఆర్‌బీఐ ఈ నెల ప్రారంభంలోనూ కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. దీంతో కీలక రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. దీని ఆధారంగానే బ్యాంకులు, తనఖా సంస్థలు వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి.


Next Story

Most Viewed