- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rupee: కేవలం డాలర్‌తో పోలిస్తేనే రూపాయిల విలువ బలహీనం
డాలర్‌తో పోలిస్తే రూపాయి మాత్రమే కాదు, ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. తొలిసారిగా డాలర్‌తో రూపాయి రూ. 88 మార్కు దాటిన తర్వాత మరింత కనిష్టానికి విలువ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత కరెన్సీ రూపాయి విలువ పతనంపై స్పందించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మాత్రమే కాదు, ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పారు. అయితే, డాలర్‌తో పోల్చినప్పుడే రూపాయి మారకం ఎక్కువ బలహీనపడింది. ఇతర కరెన్సీలతో చూస్తే బలంగా ఉంది. ఇది కూడా డాలర్ బలపడేందుకు మరో కారణం. ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు భారత రూపాయి ఈ స్థాయిలో ప్రభావితం కాలేదని ఆమె స్పష్టం చేశారు. అందుకే కరెన్సీ మారకంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రభుత్వం రూపాయి మారకపు రేటును నిశితంగా గమనిస్తోంది. ఇదివరకు అంతర్జాతీయ పరిణామాలు రూపాయి బలహీనతను ప్రభావితం చేయగా, ఇటీవల దేశీయ పరిణామాల వల్ల కూడా మారకం రేటు హెచ్చుతగ్గులకు కారణమవుతోందన్నారు. కాగా, శుక్రవారం ఇంట్రాడేలో భారత రూపాయి రూ. 88.38 వద్ద చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. అమెరికా సుంకాల ప్రభావం కారణంగానే ఈ స్థాయి పతనం నమోదైంది. ఇందుకు ప్రధానంగా భారత వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడం, ఫలితంగా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్లడం వంటి పరిణామాలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జోక్యం చేసుకుని నష్టాలను పరిమితం చేయగలిగింది.






