రూ. 35 వేల కోట్లతో పీఎల్ఐ పథకాన్ని విస్తరించే యోచనలో ప్రభుత్వం!

by Dishanational4 |
రూ. 35 వేల కోట్లతో పీఎల్ఐ పథకాన్ని విస్తరించే యోచనలో ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: దేశీయ తయారీని పెంచి, పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఈల్ఐ) పథకాన్ని మరిన్ని రంగాలకు అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ పథకం ద్వారా రూ. 35,000 కోట్లను లెదర్, సైకిల్, కొన్ని వ్యాక్సిన్ మెటీరియల్స్, టెలికాం ఉత్పత్తుల వంటి రంగాలకు విస్తరించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఓ అధికారి తెలిపారు. అలాగే, బొమ్మల తయారీ, కొన్ని రసాయనాలు, షిప్పింగ్ కంటైనర్లకు కూడా పీఎల్ఐ పథకం ప్రయోజనాలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు చర్చలో దశలోనే ఉన్నాయి. వివిధ పరిశ్రమలు, రంగాల నుంచి డిమాంద్ ఉన్నందున వాటికి పీఎల్ఐ ప్రయోజనాలు అందించేందుకు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్, ఫార్మా, సోలార్ సహా చాలా రంగాలకు దాదాపు రూ. 2 లక్షల కోట్లతో పీఈల్ఐ పథకాన్ని అమలు చేసింది. ఈ మొత్తం నుంచి మిగిలిన కొంత ఇతర రంగాలకు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. దేశీయ తయారీ రంగాన్ని ప్రపంచం ముందు పోటీగా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. గత నెలలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, పీఎల్ఐ పథకం కింద ప్రోత్సాహకాలను మరిన్ని రంగాలకు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.

Next Story