- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Swiggy: గిగ్, డెలివరీ రంగంలో ఉపాధి కల్పించేందుకు స్విగ్గీతో ప్రభుత్వం ఒప్పందం

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గిగ్ ఎకానమీలో గిగ్, లాజిస్టిక్స్ విభాగంల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీతో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్) పోర్టల్ ద్వారా గిగ్, లాజిస్టిక్స్ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, రాబోయే 2-3 ఏళ్లలో 12 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు స్విగ్గీతో ప్రభుత్వం మంగళవారం ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఎన్‌సీఎస్ పోర్టల్‌లో స్విగ్గీకి సులభంగా యాక్సెస్, ట్రాకింగ్ వెసులుబాటు లభించడం వల్ల ధృవీకరించబడిన డెలివరీ, గిగ్ ఉద్యోగాల గురించి పోస్ట్ చేస్తుంది. దీని ద్వారా యువత, మహిళలు, అనువైన వర్క్ ఆప్షన్‌లను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్‌లాజే సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ఉద్యోగ్లు, యాజమాన్యాలను కలిపే డైనమిక్ ప్లాట్‌ఫామ్. ఇందులో ఈ ఏడాది జనవరి నాటికి 1.25 కోట్ల మంది యాక్టివ్ ఉద్యోగులు, 40 లక్షల మంది రిజిస్టర్డ్ యజమానులు ఉన్నారు. స్విగ్గీతో భాగస్వామ్యం ద్వారా వేగంగా పెరుగుతున్న గిగ్ ఎకానమీ మరింత విస్తరిస్తుంది. లక్షలాది మంది యువతకు అనువైన, వారు నివశించే ప్రాంతాల వారీగా అవకాశాలు పొందేందుకు వీలవుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.