Google Pay ద్వారా నిమిషాల్లో రూ. 5 నుంచి 8 లక్షల వరకు లోన్

by Disha Web Desk 17 |
Google Pay ద్వారా నిమిషాల్లో రూ. 5 నుంచి 8 లక్షల వరకు లోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు అందిస్తూ, అత్యవసర టైంలో ఎంతగానో ఆదుకుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్ది బ్యాంకులు/ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు లేకుండా డైరెక్ట్ డిజిటల్ పద్ధతిలో లోన్ పోందే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం రోజు వాడే యాప్‌లతో సులభంగా లోన్‌లు పొందే సదుపాయం కూడా ఉంది.

అదే దేశీయంగా ఎంతో ఆదరణ కలిగిన గూగుల్ పే(Google Pay) ద్వారా కూడా ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. దీంతో రూ. 10 వేల నుంచి రూ. 8 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఇది డైరెక్ట్‌గా లోన్ ఇవ్వకుండా మధ్యవర్తిలాగా ఉంటూ వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ వచ్చేలా చేస్తుంది. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు తమకు తాముగా గూగుల్ పే తో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. ఇలా భాగస్వామ్యంతో లోన్స్ అందిస్తుంటాయి. దీని ద్వారా లోన్ పొందడం సులభంగా ఉంటుంది.

గూగుల్ పే ద్వారా లోన్ పొందడానికి వినియోగదారులు ముందుగా యాప్‌లో లోన్ అని టైప్ చేయెచ్చు లేదా క్రెడిట్ కార్డు, లోన్స్, గోల్డ్ అనే ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. వీటిలో నుండి కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలాగే ఇందులో ఉండే వివిధ ఫైనాన్స్ కంపెనీలు రూ. 1000 నుంచి రూ. 5 లేదా 8 లక్షల వరకు లోన్‌ అందిస్తాయి.

ఇవి ఎలాంటి పేపర్ లేకుండా ఆధార్, పాన్, అడ్రస్ వంటి వివరాలతో క్షణాల్లో లోన్‌ను అందిస్తాయి. కాకపోతే అందరికి కాకుండా క్రెడిట్ స్కోర్ బాగుండి, ఆర్థిక లావాదేవీలు, పాత లోన్‌లు క్లియర్‌గా ఉన్నవారికి వారి అర్హత ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాయి. వీటి వడ్డీ రేటు 15 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ప్రాసెస్ పూర్తయ్యాక అర్హతను బట్టి అమౌంట్‌ను అకౌంట్లో జమచేస్తారు.

Read more:

తిరిగి లోన్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారా.. అయితే ఇది మీకోసమే


Next Story

Most Viewed