Paytm: పేటీఎమ్‌లో 1.3 శాతం వాటా కొన్న గోల్డ్‌మన్ శాక్స్, ఇతర కంపెనీలు

by S Gopi |

గ్లోబల్ కంపెనీలు గోల్డ్‌మన్ శాక్స్, సిటీ గ్రూప్, సొసైటీ జనరల్ పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో 1.34 శాతం వాటాను కొనుగోలు చేశాయి.

Paytm: పేటీఎమ్‌లో 1.3 శాతం వాటా కొన్న గోల్డ్‌మన్ శాక్స్, ఇతర కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎమ్‌లో దిగ్గజ పెట్టుబడి సంస్థలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. గ్లోబల్ కంపెనీలు గోల్డ్‌మన్ శాక్స్, సిటీ గ్రూప్, సొసైటీ జనరల్ పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో 1.34 శాతం వాటాను కొనుగోలు చేశాయి. మొత్తం 85.98 లక్షల షేర్లను రూ. 1,120.65 ధరకు మొత్తం రూ. 963 కోట్లకు కొనుగోలు చేశాయి. ఇదే సమయంలో బీఎన్‌పీ పరిబాస్, ఘీసాలో క్యాపిటల్ మేనేజ్‌మెంట్, విరిడియన్ అసెట్ మేనేజ్‌మెంట్ వంటి విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలతో పాటు సుందరం మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా ఎంఎఫ్, ఎడెల్‌వీస్ ఎంఎఫ్ లాంటి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా పేటీఎమ్‌లో పెట్టుపడి పెట్టారు. ఇటీవల పేటీఎమ్ కమెప్నీ మెరుగైన లాభాలను వెల్లడించడం, ఆదాయ వృద్ధిని నమోదు చేయడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025-26లో కంపెనీ రూ.552 కోట్ల లాభాలను ప్రకటించింది. కార్యకలాపాల ఆదాయం 22 శాతం పెరిగి రూ.8,437 కోట్లకు చేరింది. అయితే భారీ బ్లాక్ డీల్ జరిగిన రోజే పేటీఎమ్ షేరు ధర దాదాపు 4 శాతం పడిపోయి రూ.1,112.50 వద్ద ముగిసింది.

Next Story