Gold Prices Today: మహిళలకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Kodari Anjali |

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు.

Gold Prices Today: మహిళలకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతిరోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతారు.

అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా... మరోసారి నిరాశకు గురవుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్, త్రిబుల్ ధర పెరుగుతుంది. ఇవాళ గోల్డ్ ప్రియులకు కాస్త ఊరట లభించింది. నిన్న 22 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారం రూ. 89, 150 ఉండగా.. నేడు రూ. 1050 పెరిగి రూ. 90, 200గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 97, 260 గా ఉంది. నేడు రూ. 1,140 పెరిగి రూ. 98, 400 గా ఉంది. కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

హైదరాబాదులో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 90, 200 (నిన్నటి ధర రూ. 89, 150)

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 98, 400(నిన్నటి ధర రూ. 97, 260)

విజయవాడలో నేటి బంగారం ధర.

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 90, 200 (నిన్నటి ధర రూ. 89, 150)

24 క్యారెట్ల బంగారం ధర- రూ.98, 400(నిన్నటి ధర రూ. 97, 260)

Next Story