Gold Prices Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Kodari Anjali |   (  Updated:2025-06-17 06:05:52  IST  )

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు.

Gold Prices Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతిరోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతారు.

అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా.. మరోసారి నిరాశకు గురవుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్, త్రిబుల్ ధర పెరుగుతుంది. ఇవాళ గోల్డ్ ప్రియులకు కాస్త ఊరట లభించింది. నిన్న 22 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారం రూ. 93, 050 ఉండగా.. నేడు రూ. 1050 తగ్గి రూ. 92,000గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 01, 510 గా ఉంది. నేడు రూ. 1, 140 తగ్గి రూ.1, 00, 370గా ఉంది. ఇక తెలుగు కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు చూసినట్లైతే..

హైదరాబాదులో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 92,000 (నిన్నటి ధర రూ. 93, 050)

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 1, 00, 370(నిన్నటి ధర రూ. 1, 01, 510)

విజయవాడలో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ.92,000 (నిన్నటి ధర రూ. 93, 050)

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 1, 00, 370(నిన్నటి ధర రూ. 1, 01, 510)

Next Story