ఈడీ స్వాధీనం చేసుకున్న నిధులు మావి కావు: పేటీఎం మాతృ సంస్థ!

by Disha Web Desk 16 |
ఈడీ స్వాధీనం చేసుకున్న నిధులు మావి కావు: పేటీఎం మాతృ సంస్థ!
X

న్యూఢిల్లీ: రుణ యాప్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ, పేటీఎం సంస్థల్లో ఈడీ తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) ఫ్రీజ్ చేసిన నిధుల్లో ఏవీ కూడా పేటీఎం కానీ, దాని గ్రూప్ సంస్థలకు చెందినవి కావని పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ ఆదివారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. చైనా ఆధారిత ఫిన్‌టెక్ కంపెనీలు చట్టవిరుద్ధంగా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా తక్షణ రుణాలు అందిస్తున్నాయని, ఇందులో భాగంగానే రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ, పేటీఎం లాంటి ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే కంపెనీల ఆఫీసుల్లో శనివారం ఈడీ తనిఖీలు చేపట్టింది. బెంగళూరులోని మొత్తం ఆరు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించినట్టు శనివారం ఈడీ ప్రకటించింది. ఈ దాడుల్లో చైనా నియంత్రణలోని కంపెనీల బ్యాంకు ఖాతాలు, మర్చెంట్ ఐడీల నుంచి రూ. 17 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ పేర్కొంది. భారత వ్యక్తుల పేరుతో నకిలీ పత్రాల ఆధారంగా చైనా యాప్ కంపెనీల్లో నకిలీ డైరెక్టర్లుగా చూపించారని, తద్వారా నేరాలకు పాల్పడుతున్నట్టు ఈడీ వెల్లడించింది.

Next Story

Most Viewed