- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FMCG Companies: మరోసారి సబ్బులు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలు పెరిగే ఛాన్స్
ఇప్పటికే కొన్ని సంస్థలు 3-5 శాతం వరకు ధరలను పెంచగా, అవసరమైతే మరింత పెంపు చేపడతామని ఇటీవల స్పష్టం చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: నిత్యావసర వస్తువుల ధరలు మరోసారి పెరగనున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు వంటి రోజువారీ వినియోగ వస్తువులు త్వరలో మరింత ఖరీదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరల పెంపు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు 3-5 శాతం వరకు ధరలను పెంచగా, అవసరమైతే మరింత పెంపు చేపడతామని ఇటీవల స్పష్టం చేశాయి. ప్రపంచ సరఫరాలో నెలకొంటున్న అంతరాయాలు, రూపాయి బలహీనత కూడా కంపెనీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. డాబర్ ఇండియా, బ్రిటానియా ధరల సవరణ తప్పదని తెలిపాయి. ఇక ఫెవికల్ తయారీ సంస్థ పిడిలైట్ ఇండస్ట్రీస్, కూల్ డ్రింక్స్ కంపెనీలు కూడా ధరల పెంపు లేదా డిస్కౌంట్ల తగ్గించే దిశగా ఆలోచిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగితే, రాబోయే నెలల్లో రోజువారీ వినియోగ వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు వెల్లడించారు. ధరలను పెంచడంతో పాటు, ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరో వ్యూహాన్ని కూడా అనుసరిస్తున్నాయి. ‘ష్రింక్‌ఫ్లేషన్’, అంటే ధరను అలాగే ఉంచి, ప్యాక్ పరిమాణాన్ని తగ్గించడం. ముఖ్యంగా రూ.5, రూ.10, రూ.15 ధరల్లో అమ్ముడయ్యే చిన్న ప్యాకెట్లలో ఈ మార్పులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది.






