ఒక్క క్లిక్‌తో మీరు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులో ఇలా తెలుసుకోండి

by Disha Web Desk 17 |
ఒక్క క్లిక్‌తో మీరు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులో ఇలా తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను తీసుకొస్తుంది. ఇప్పటికే వివిధ రకాల పథకాలను ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. చాలా మందికి అన్ని రకాల ప్రభుత్వ స్కీమ్‌ల గురించి తెలియదు. తెలిసిన కొన్నింటిని మాత్రమే వినియోగించుకుంటున్నారు. అందరు అన్ని స్కీమ్‌లకు అర్హత కలిగి ఉండకపోవచ్చు. దరఖాస్తుదారుని అర్హత ఆధారంగా కేంద్రం వారికి పలు స్కీమ్‌లను అందిస్తుంది. అందులో ముఖ్యంగా సోషల్ వెల్‌ఫేర్‌, బ్యాంకింగ్, ఫైనాన్సియల్‌, చదువులకు, ఆరోగ్యానికి, స్కిల్ డెవలప్‌మెంట్‌, వ్యవసాయ సంబంధ అంశాలకు సంబంధించినవి మొదలగునవి ఉంటాయి. వీటిలో ఏ పథకానికి ఎవరు అర్హత ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం.

అందుకే చాలా సింపుల్‌గా మీ వివరాలు నమోదు చేయగానే మీరు అర్హత కలిగిన, మీకు సూటబుల్ అయ్యే స్కీమ్‌ల లిస్ట్‌ను చూపించడానికి కొత్తగా https://www.myscheme.gov.in/ అనే సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సైట్‌లో మీ పేరు, వయస్సు తదితర వివరాలు ఇవ్వగానే మీకు సరిపోయే, అర్హత కలిగిన స్కీమ్‌ల లిస్ట్‌ మొత్తం కనిపిస్తుంది.

అర్హత కలిగిన స్కీమ్‌ల గురించి తెలుసుకునే విధానం..

* ముందుగా https://www.myscheme.gov.in/ అనే వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేయాలి.

* Find Schemes For You అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

* తర్వాత లింగం, వయస్సు, మ్యారేజ్/అన్ మ్యారేజ్ వివరాలు నమోదు చేయాలి.

* తరువాత రాష్ట్రం, పట్టణం/గ్రామీణ, కమ్యూనిటీ, స్టూడెంట్/ఉద్యోగి, BPL కేటగిరీ వివరాలను నమోదు చేయాలి.

* చివరి పేజిలో 13 రంగాలకు సంబంధించిన అంశాలు వస్తాయి.

* వీటిలో మీరు అర్హత కలిగిన పథకాలను, రంగాల వారీగా చూపిస్తుంది.

* మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి ఆ స్కీమ్‌ల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.

* ఇక్కడ ఇవ్వబడిన పథకాలకు మీరు ఎలిజిబుల్‌గా ఉన్నట్టు అని అర్థం.



Next Story

Most Viewed