- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FADA: ప్రైవేట్ బ్యాంకులపై ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసిన డీలర్ల సంఘం ఫాడా
ఆటో రుణగ్రహీతలకు 100 శాతం వడ్డీ రేటు ప్రయోజనాలను బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: వాహన కొనుగోలుదారులకు వడ్డీ రేట్ల కోతల ప్రయోజనాలను అందించడంలో ప్రైవేట్ బ్యాంకులు జాప్యం చేస్తున్నాయని ఆటో డీలర్ల సంఘం ఫాడా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు లేఖ రాసింది. అందులో.. ఆటో-లోన్ పోర్ట్‌ఫోలియోలో ప్రైవేట్ బ్యాంకుల రెపో ఆధారిత వడ్డీ రేట్ల అమలును సమీక్షించాలని, ఆటో రుణగ్రహీతలకు 100 శాతం వడ్డీ రేటు ప్రయోజనాలను బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని పేర్కొంది. ఆర్థికవ్యవస్థకు పుష్ ఇచ్చేలా ఆర్‌బీఐ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కీలక రేట్లలో కోత విధించింది. 'మీ నేతృత్వంలో తక్కువ సమయంలో వేగంగా రేట్ల తగ్గింపు అమలైంది. కానీ, వాహన పరిశ్రంలో ఆ స్థాయి ప్రయోజనాలు కనిపించడంలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులు వాహన కొనుగోలుదారులకు అనుగుణంగా వడ్డీ రేట్లు సవరించినప్పటికీ, ప్రైవేట్ బ్యాంకులు ఆవైపుగా ఆలోచన కూడా చేయలేదు. అంతర్గత నిధుల వ్యయ అంచనాల సాకుతో వడ్డీ ప్రయోజనాలను బదిలీ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయని' ఫాడా వైస్-ప్రెసిడెంట్ సాయి గిరిధర్ లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకులు పాలసీ-రేటు మార్పులను అమలు చేసేలా, వడ్డీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.






