SBI హెచ్చరిక.. వినియోగదారులు వెంటనే ఫిర్యాదు చేయాలి!

by Disha Web Desk 17 |
SBI  హెచ్చరిక.. వినియోగదారులు వెంటనే ఫిర్యాదు చేయాలి!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ ఖాతాదారులను హెచ్చరించింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకు సైబర్ మోసగాళ్లు అనేక మార్గాలను అనుసరిస్తున్నారని, డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి అనధికార లావాదేవీల గురించి తక్షణం ఫిర్యాదు చేయాలని ఖాతాదారులను కోరింది.

ముఖ్యంగా పండుగ సీజన్ సమయంలో జరిగే చెల్లింపుల కోసం వాడే యాప్, బ్యాంకింగ్ సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని, ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయడం వల్ల వినియోగదారులు నష్టపోయే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ అభిప్రాయపడింది.

తక్షణమే ఫిర్యాదు చేయడం ద్వారా వినియోగదారుని ఖాతా నుంచి పోయిన నగదును ఇతర మోసపూరిత అకౌంట్లకు వెళ్లకుండా చేసే వీలుంటుంది. సకాలంలో చర్యలు తీసుకుంటే నష్టపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ వివరించింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా ఉండటం ముఖ్యమని తెలిపింది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అన్ని రకాల లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను చేయవచ్చని, ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత మోసపూరిత సైబర్ నేరగాళ్లకు చెందిన వాటిని బ్లాక్ చేయనున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది.

ఇవి కూడా చ‌ద‌వండి

1.ఏటీఎం దీపావళి ఆఫర్..!? రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల క్యాష్



Next Story

Most Viewed