2022-23 లో క్రెడిట్ కార్డు ఖర్చులు రూ.14 లక్షల కోట్లు!

by Disha Web Desk 17 |
2022-23 లో క్రెడిట్ కార్డు ఖర్చులు రూ.14 లక్షల కోట్లు!
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల వ్యయం వార్షిక ప్రాతిపదికన 47 శాతం పెరిగి రూ. 14 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ-కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీల పెరుగుదలే క్రెడిట్ కార్డు ఖర్చుల వృద్ధికి దోహదపడ్డాయి. ఈ ఏడాది మార్చిలో మాత్రమే క్రెడిట్ కార్డుల వ్యయం రూ. 1.37 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి.

వినియోగదారులు అన్ని అవసరాలకు ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడటం పెరిగిందని, అందుకే గత నెల వరుసగా 13వ నెలలో ఈ ఖర్చులు రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. మొత్తం లావాదేవీల్లో ఈ-కామర్స్ వాటా మాత్రమే 63 శాతం ఉండటం గమనార్హం.

ఇక, 2022-23లో కొత్తగా 1.16 కోట్ల క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు 2021-22లో 1.11 కోట్లతో పోల్చితే ఇది స్వల్పంగా పెరిగాయి. క్రెడిట్ కార్డుల వినియోగంలో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 54 శాతం వృద్ధిని చూడగా, ఐసీఐసీఐ బ్యాంక్ 20 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 14 శాతం, ఎస్‌బీఐ 11 శాతం పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి.

Also Read..

వరుస తొమ్మిది సెషన్‌ల లాభాలకు బ్రేక్!


Next Story

Most Viewed