సెప్టెంబర్‌లో కీలక రంగాల వృద్ధి 8 శాతం!

by Disha Web Desk 17 |
సెప్టెంబర్‌లో కీలక రంగాల వృద్ధి 8 శాతం!
X

న్యూఢిల్లీ: దేశంలో కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి ఈ ఏడాది సెప్టెంబర్‌లో 7.9 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో 5.4 శాతం వృద్ధి నమోదైంది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో బొగ్గు ఉత్పత్తి 12 శాతం, పెట్రోలియం ఉత్పత్తులు 6.6 శాతం, ఎరువులు 11.8 శాతం, స్టీల్ 6.7 శాతం, సిమెంట్ 12.1 శాతం, విద్యుదుత్పత్తి 11 శాతం వృద్ధి చెందాయి.

ఇదే సమయంలో ముడి చమురు 2.3 శాతం, సహజ వాయువు 1.7 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో బొగ్గు 21 శాతం, సహజ వాయువు 1.8 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 10.1 శాతం, ఎరువులు 11.5 శాతం, స్టీల్ 6.5 శాతం, సిమెంట్ 10.9 శాతం, విద్యుదుత్పత్తి 10.7 శాతం పెరగ్గా, ముడి చముదు 1.3 శాతం తగ్గింది.

బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ వంటి ఈ ఎనిమిది మౌలిక రంగాలను కీలక రంగాలుగా వ్యవహరిస్తారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది.



Next Story

Most Viewed