మార్చి 28 నుంచి టీ+0 సెటిల్‌మెంట్.. మొదట 25 షేర్లకు బీఎస్ఈ అనుమతి

by Dishanational1 |
మార్చి 28 నుంచి టీ+0 సెటిల్‌మెంట్.. మొదట 25 షేర్లకు బీఎస్ఈ అనుమతి
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించి సెటిల్‌మెంట్ ప్రక్రియను నియంత్రణ సంస్థ సెబీ వేగవంతం చేస్తోంది. ఈ నెల 28(గురువారం) నుంచి ఆప్షనల్ బేసిస్ కింద టీ+0 సెటిల్‌మెంట్ బీటా వెర్షన్‌ను ప్రారంభించనుంది. ప్రయోగాత్మకంగా మొదట 25 షేర్లకు, కొందరు బ్రోకర్లకు మాత్రమే దీన్ని వర్తించేలా బీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో షేర్లను కొంటే టీ+1 అంటే ట్రేడింగ్ చేసిన మరుసటి రోజు సెటిల్‌మెంట్ జరుగుతోంది. కొత్త మార్పుతో ట్రేడింగ్ జరిగిన రోజే సెటిల్‌మెంట్ పూర్తవుతుంది. ఇది మూడు నుంచి ఆరు నెలల తర్వాత సమీక్షించనున్నారు. సమస్యలేమీ ఎదురవకపోతే పూర్తిస్థాయిలో అమలవుతుంది. టీ+0 సెటిల్‌మెంట్ కోసం అనుమతిచ్చిన కంపెనీల్లో బజాజ్ ఆటో, వేదాంత, ఎస్‌బీఐ, నెస్లె ఇండియా, అంబుజా సిమెంట్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్ సహా పలు దిగ్గజాలు ఉన్నాయి. కొత్త సెటిల్‌మెంట్ వల్ల బ్రోకర్లు సొంత నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. దీనివల్ల వ్యాపార ఖర్చులు తగ్గుతాయి. ఎవరైన క్లయింట్ షేర్లను విక్రయితే వెంటనే ఆ మొత్తం ట్రేడింగ్ అకౌంట్‌లో జమ అవుతుంది. దాంతో షేర్ల కొనుగోళ్లు చేయవచ్చు. తక్షణ సెటిల్‌మెంట్‌తో మార్కెట్లలో ద్రవ్య లభ్యత కూడా పెరుగుతుంది.


Next Story

Most Viewed