భారత్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంటులో కార్మికులను నాలుగు రెట్లు పెంచనున్న ఫాక్స్‌కాన్!

by Disha Web Desk 17 |
భారత్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంటులో కార్మికులను నాలుగు రెట్లు పెంచనున్న ఫాక్స్‌కాన్!
X

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ తయారీ యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ భారత్‌లోని తన ఐఫోన్ ఫ్యాక్టరీల్లో కార్మికుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలని భావిస్తోంది. ఇటీవల చైనాలోని ప్రధాన జెంగ్‌జౌ ప్లాంట్ పరిధిలో కఠిన కొవిడ్ సంబంధిత అంతరాయాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో ఫాక్స్‌కాన్ రాబోయే రెండేళ్లలో భారత్‌లో కార్మికుల సంఖ్యను పెంచడం ద్వారా సవాళ్లను అధిగమించాలని చూస్తోంది.

ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ప్రభుత్వ అధికారుల ప్రకారం, చైనాలో అంతరాయం వల్ల తగ్గిన ఉత్పత్తిని సర్దుబాటు చేసేందుకు కంపెనీ భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తోంది. చైనాలో పరిస్థితుల వల్ల యాపిల్ తమ ప్రీమియం ఐఫోన్ 14 మోడళ్ల సరఫరాలో ఇబ్బందులను ఎదుర్కొంది. దీనివల్ల భారత్‌లో కీలకమైన పండుగ సీజన్ సమయంలో అమ్మకాలపై ప్రభావం కనబడింది. అందుకే ఫాక్స్‌కాన్ తాజా నిర్ణయం తీసుకుంది.

తైవాన్‌ పరిశ్రమ ఫాక్స్‌కాన్‌కు చెందిన దక్షిణ భారత్‌లోని ప్లాంట్‌లో ప్రస్తుతం 53 వేల మంది పని చేస్తుండగా, దీన్ని వచ్చే రెండేళ్లలో 70 వేలకు పెంచనుంది. అయితే, దీనికి సంబంధించి ఫాక్స్‌కాన్‌తో పాటు యాపిల్ కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Next Story

Most Viewed