- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Infosys: కోడింగ్ కంటే ఏఐతో పనిచేయించడం ముఖ్యం
వ్యాపారాల నిర్వహణను పూర్తిస్థాయి మార్చేందుకు ఏఐ సిద్ధంగా ఉందని తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ గ్రామర్‌ను తిరిగి రాస్తోంది, ఇకపై టెక్ నిపుణులకు కోడ్స్ రాయడం అంత ముఖ్యమైన పని కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అన్నారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇంటర్నెట్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు గతంలో జరిగిన ఏ సాంకేతిక మార్పు కూడా ఇంత వేగంగా జరగలేదు. వాటి కంటే వేగంగా ఏఐని అలవాటు చేసుకుంటున్నారని, వ్యాపారాల నిర్వహణను పూర్తిస్థాయి మార్చేందుకు ఏఐ సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కోడ్స్ రాయడం అంత ముఖ్యం కాకపోవచ్చు, ఏఐతో పని చేయించడం, టూల్స్‌ను వాడి వ్యాపారాభివృద్ధిని సాధించడమే అత్యంత ప్రధానం. రానున్న రోజుల్లో "కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలు, పని చేసే విధానం, సంస్థ ఉద్దేశాల్లో మార్పులు రావాలి. ఇకమీదట ఏ మాత్రం పాత పద్ధతిలోనే సంస్థలు పనులు చేయలేవని నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కోడింగ్‌కు ప్రధాన్యత తగ్గే ఛాన్స్ ఉన్నా సరే, కొత్త ఉద్యోగాలు కూడా అంతే వేగంగా పుట్టుకొస్తాయని ఆయన స్పష్టం చేశారు.






