- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం... భారీగా పడిపోయిన బోయింగ్ షేర్ ధర
గుజరాత్ లో నేడు ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లో నేడు ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా(Air India Flight Crash)కు చెందిన AI 171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం(Boeing 787-8 Dreamliner Flight) టేకాఫ్ అయిన వెంటనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్, మరో రెండు భారీ భవనాలపై కుప్పకూలింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు అంతా మరణించారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో బోయింగ్ కంపెనీ షేర్ ధర భారీగా పడిపోయింది(Boeing Shares Down). మధ్యాహ్నం ఫ్లైట్ క్రాష్ న్యూస్ బయటికి రాగానే ఒక్కసారిగా షేర్ వాల్యూ 6.5% డౌన్ అయింది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న బోయింగ్ భారీ ప్రమాదాలు, టెక్నికల్ ఫెయిల్యూర్స్, వివాదాల వల్ల షేర్లు అమ్మేసినట్టు సమాచారం. ఈరోజు ప్రమాదం జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం నాన్ స్టాప్ గా 13,530 కిమీలు ప్రయాణించగలదు.






