ఏడేళ్ల తర్వాత మార్కెట్ విలువలో అగ్రస్థానానికి టాటా మోటార్స్

by Dishanational1 |
ఏడేళ్ల తర్వాత మార్కెట్ విలువలో అగ్రస్థానానికి టాటా మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త మార్కును చేరుకుంది. దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అగ్రస్థానానికి చేరింది. మంగళవారం కంపెనీ షేర్లు కొత్త గరిష్ఠాలను తాకడంతో ఏడు సంవత్సరాల విరామం తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా మారుతీ సుజుకిని టాటా మోటార్స్ అధిగమించింది. టాటా మోటార్స్ రూ. 2,85,515 కోట్లకు, టాటా మోటార్స్ డీవీఆర్ రూ. 29,119 కోట్లకు పెరగడంతో మొత్తం మార్కెట్ విలువ రూ. 3,14,635 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రూ. 3,13,058 కోట్లతో మారుతీ సుజుకి రెండో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఉంది. ఇదివరకు 2017లో మారుతీ సుజుకి రూ. 1.76 లక్షల కోట్లతో టాటా మోటార్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం టాటా మోటార్స్ షేర్ 2.84 శాతం పెరిగి రూ. 864.90 వద్ద, టాటా మోటార్స్ డీవీఆర్ షేర్లు 1.6 శాతం పెరిగి రూ. 572.65 వద్ద ముగిసింది.


Next Story

Most Viewed