NDTV ఓపెన్ ఆఫర్‌ సేల్‌కు కొత్త తేదీలను ప్రకటించిన అదానీ గ్రూప్

by Disha Web Desk 17 |
NDTV ఓపెన్ ఆఫర్‌ సేల్‌కు కొత్త తేదీలను ప్రకటించిన అదానీ గ్రూప్
X

ముంబై: NDTV లో 26 శాతం వాటా కొనుగోలుకు సంబంధించిన ఓపెన్ ఆఫర్‌ నవంబర్ 22 న ప్రారంభమై డిసెంబర్ 5 ముగయనున్నట్లు అదానీ గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రూ. 4 ముఖ విలువ కలిగిన 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి ఈ ఓపెన్ ఆఫర్‌ను తీసుకొచ్చారు. దీని కోసం ఒక్కో షేరు ధర రూ. 294గా నిర్ణయించినట్లు ఆఫర్‌ను నిర్వహిస్తున్న JM ఫైనాన్షియల్ తెలిపింది. అంతకుముందు, గౌతమ్ అదానీ నేతృత్వంలోని కంపెనీ అక్టోబర్ 17 నుండి నవంబర్ 1 వరకు ఎన్‌డిటివిలో వాటాను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కానీ ఇది వాయిదా పడింది.

ఎన్‌డిటివి ప్రమోటర్ అయిన RRPR హోల్డింగ్ ప్రవైట్ లిమిటెడ్‌కు అదానీ గ్రూప్ పరోక్ష అనుబంధ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) 2009-10లో రూ. 403.85 కోట్ల రుణం ఇచ్చింది. రుణం తిరిగి చెల్లించ లేకపోతే రుణాన్ని RRPR హోల్డింగ్‌లో 99.99 శాతం వాటాగా మార్చుకొడానికి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తీసుకున్న రుణం 29.18 శాతం వాటాగా మారడంతో ఎన్‌డిటివి ఛానెలల్‌లో అదానీ గ్రూప్ వాటాలు పొందింది. ఇప్పుడు దీనికి అదనంగా 26 శాతం (1.67 కోట్ల ఈక్విటీ షేర్ల)వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఈ సేల్ పూర్తయితే ఎన్‌డిటివి సగం వాటా అదానీ సొంతం అవుతుంది.

Next Story

Most Viewed