- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ACs: మరోసారి పెరగనున్న ఏసీ ధరలు
పరిశ్రమలో ధరలు ఇప్పటికే 14–16 శాతం వరకు పెరిగాయని, ఇది దాదాపు ఒక దశాబ్దం తర్వాత అత్యధిక పెరుగుదల అని ఆయన పేర్కొన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే నెలల్లో ఏసీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ బ్లూస్టార్ ఎండీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వెస్ట్రన్ రీజియన్ ఛైర్మన్ వీర్ ఎస్ అద్వానీ స్పష్టం చేశారు. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి కీలక ముడిసరుకుల ధరలు గణనీయంగా పెరగడం, అలాగే కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు అమలులోకి రావడం వల్ల తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. పరిశ్రమలో ధరలు ఇప్పటికే 14–16 శాతం వరకు పెరిగాయని, ఇది దాదాపు ఒక దశాబ్దం తర్వాత అత్యధిక పెరుగుదల అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. వీటికి అనుగుణంగా తయారీని చేపట్టే క్రమంలో ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది నెలల్లో మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల్లో చాలావరకు పాత ప్రమాణాలకు చెందినవే కావడంతో ధరల ప్రభావం పూర్తిగా వినియోగదారులకు బదిలీ కాలేదు. కానీ కొత్త ప్రమాణాల ప్రకారం తయారయ్యే ఉత్పత్తులు ఎక్కువ ఖర్చుతో ఉండటంతో, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు.






