కొత్త అవకాశాలపై ప్రొఫెషనల్ ఉద్యోగుల అన్వేషణ

by Dishanational1 |
కొత్త అవకాశాలపై ప్రొఫెషనల్ ఉద్యోగుల అన్వేషణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ప్రొఫెషనల్ ఉద్యోగుల్లో చాలామంది ఈ ఏడాది తమ కెరీర్‌లో మరింత ఎదిగేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నట్టు ఓ నివేదికలో తేలింది. ప్రముఖ లింక్‌డిన్ పరిశోధన ప్రకారం, దేశంలోని 10 మంది ప్రొఫెషనల్ ఉద్యోగుల్లో తొమ్మిది మంది(88 శాతం) 2024లో కొత్త ఉద్యోగాలకు మారాలని చూస్తున్నారు. 42 శాతం మంది మెరుగైన పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత కోసం ఉద్యోగాలను మారతామని చెప్పారు. దాదాపు 37 శాతం మంది ప్రమోషన్లతో పాటు అధిక వేతనం కోసం మారాలని భావిస్తున్నారు. '2024లో చాలామంది దేశీయ ప్రొఫెషనల్ ఉద్యోగులు కెరీర్ వృద్ధిని ఆశిస్తుండటంతో, కొత్తగా జాబ్ మార్కెట్లోకి ప్రవేశించే వారితో పోటీ అధికం కానుందని' లింక్‌డిన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ అన్నారు. 10 మందిలో ఎనిమిది మంది(79 శాతం) భారతీయ ఉద్యోగులు తమ కంపెనీ లేదా ప్రమోషన్ కోసం కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మారుతున్న స్కిల్స్ విషయంలో సవాళ్లు ఉన్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రధానంగా ఏఐ లాంటి వేగవంతమైన టెక్నాలజీ విస్తరణ కారణంగా 2015 నుంచి దేశంలో జాబ్ స్కిల్స్ 30 శాతం మారాయని లింక్‌డిన్ పేర్కొంది.



Next Story

Most Viewed