లేఆఫ్ తర్వాత సొంత కంపెనీలను ప్రారంభిస్తున్న టెక్ ఉద్యోగులు!

by Disha Web Desk 17 |
లేఆఫ్ తర్వాత సొంత కంపెనీలను ప్రారంభిస్తున్న టెక్ ఉద్యోగులు!
X

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో అత్యధికంగా టెక్ కంపెనీల్లోనే జరిగాయి. దీనిపై ప్రముఖ లెండింగ్ సంస్థ క్లారిఫై కేపిటల్ వివరాలను సేకరించగా, ఉద్యోగాలను కోల్పోయిన వారిలో దాదాపు 63 శాతం మంది టెక్ నిపుణులు తమ సొంత కంపెనీలను ప్రారంభించారని తెలుస్తోంది.

ఈ కొత్త కంపెనీల్లో 83 శాతం టెక్నాలజీ రంగంలోనే ఉన్నాయి. లేఆఫ్స్ తర్వాత ప్రతి నలుగురిలో ఒక టెక్ ఉద్యోగి ఇతర కంపెనీల్లో చేరకుండా సొంతంగా కంపెనీ కోసం ప్రయత్నిస్తున్నారని క్లారిఫై కేపిటల్ నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకు ఉద్యోగాల నుంచి తొలగించబడిన, సొంతంగా కంపెనీలు ప్రారంభించిన వెయ్యి మందికి పైగా ఉద్యోగుల నుంచి నివేదిక వివరాలను సేకరించింది.

అందులో 93 శాతం మంది తాము ఉద్యోగం కోల్పోయిన కంపెనీతో పోటీ పడేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా లేఆఫ్ తర్వాత కంపెనీ ప్రారంభించిన టెక్ ఉద్యోగుల జీతం సగటున రూ. 10 లక్షలు పెరగడం గమనార్హం. ఉద్యోగాలను కోల్పోయిన 58 శాతం టెక్ ఉద్యోగులు కొత్త ఉద్యోగం గురించి మెరుగైన నిర్ణయం తీసుకుంటున్నారని నివేదిక పేర్కొంది.



Next Story