గుడ్‌న్యూస్: ఆ రైతులకు PM కిసాన్‌ రూ. 4000..?

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్: ఆ రైతులకు PM కిసాన్‌ రూ. 4000..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM కిసాన్) ద్వారా ప్రతి ఏడాది రూ. 6000 లను అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని మూడు విడతలుగా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటికే 13 విడత పంపిణీని విజయవంతంగా పూర్తి చేసిన కేంద్రం, తర్వాత 14 వ విడత డబ్బులను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే 13 విడతలో కొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదు. చాలా మంది రైతులు వారి KYC ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయని కారణంగా PM కిసాన్ నిధులను పొందలేదు.


కేంద్రం ఇప్పటికే చాలా సార్లు KYC గురించి, తప్పులు లేకుండా అప్లై చేయడం గురించి రైతలకు పలు మార్లు హెచ్చరికలు కూడా చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు తమ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడంతో 13వ విడతలో రూ.2000 పొందని రైతులకు 14 విడత పంపిణీలో భాగంగా మొత్తం రూ.4వేలు అందుతాయని సంబంధిత వర్గాల వారు అంచనా వేస్తున్నారు. కానీ దీనిపై కేంద్రం అధికారికంగా స్పందించలేదు. PM కిసాన్ 14వ విడత: 2023 లబ్ధిదారుల జాబితాను తెలుసుకోడానికి అధికారిక వెబ్‌సైట్- https://pmkisan.gov.in/#:~:text=PM%20KISAN%20SAMMAN,Government%20of%20India

Next Story