హ్యారీ పోటర్ బేస్డ్ చీపురు కట్ట స్కూటర్లు..

by  |
హ్యారీ పోటర్ బేస్డ్ చీపురు కట్ట స్కూటర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యారీ పోటర్ పుస్తకాలు, సినిమాలు ఒక మాయాప్రపంచానికి తీసుకెళ్తాయి. ఆ మాయా ప్రపంచంలో వివిధ రకాల రవాణా సర్వీసులు ఉంటాయి. బూడిద చేతిలో పట్టుకుని పొయ్యిలో నిల్చుని కావాల్సిన ప్రదేశానికి వెళ్లడం, గోడల గుండా ప్రయాణించడంతో పాటు ఎగిరే కారు, అన్నింటికన్నా ముఖ్యంగా చీపురు కట్ట మీద ప్రయాణం చేయడం ఇలా వివిధ రకాల వింత రవాణా మార్గాలు ఉన్నాయి. ఈ ఫాంటసీ ప్రపంచాన్ని పూర్తిస్థాయిలో నిజజీవితంలో చూపించడం కష్టం. అందుకే మంత్రదండాలు, డ్రెస్సులు, ఇంకా ఇతర మర్చండైజ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. వీటితో పాటు ఇప్పుడు చీపురు కట్ట మీద ప్రయాణాన్ని కూడా నిజజీవితంలోకి తీసుకువచ్చేశారు.

బ్రెజిల్‌కు చెందిన వినిషియస్ సాంక్టస్, అలెగ్జాండ్రో రూసోలు కొత్తగా చీపురు కట్ట స్కూటర్‌లను తయారుచేశారు. ఒక్కటే చక్రం ఉండి, పైన చీపురు కట్టను అమర్చి ఉన్న ఈ స్కూటర్ మీద ప్రయాణం చేస్తుంటే అచ్చం హ్యారీ పోటర్ ప్రపంచంలో చీపురు కట్ట మీద ఎగురుతున్న ఫీలింగ్ వచ్చేలా వారు దీన్ని తయారు చేశారు. మరి దీనికి హ్యాండిల్ లేదు కదా… కావాల్సిన వైపునకు మళ్లించడం ఎలా? అని అడిగితే, ఎటు వైపు వెళ్లాలనుకుంటే అటు వైపుగా ఈ చీపురు కట్ట మీద వంగితే సరిపోతుందని వారు చెబుతున్నారు. ఈ చీపురు కట్ట స్కూటర్‌లు గంటకు 60 కి.మీ.ల వేగంతో వెళ్లగలవని, రోజువారీ నగర జీవిత అవసరాలకు ఇవి తగ్గట్టుగా ఉంటాయని వారు వెల్లడించారు.



Next Story

Most Viewed