లండన్‌లో షారుఖ్, కాజోల్ విగ్రహావిష్కరణ!

336

దిశ, వెబ్‌డెస్క్: ఎవర్ గ్రీన్, ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’. ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు, అతిథులు.. భారత సినీ చరిత్ర, సినీ ఎంటర్‌టైన్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే చెప్పే తొలి సినిమా ఇదే. బరాక్ ఒబామా నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు మన దేశానికి విచ్చేసినప్పుడు తమ ప్రసంగంలో పొందుపరిచిన సినిమా ఇదే. వరల్డ్‌వైడ్‌గా ఖ్యాతి గడించిన ఈ చిత్రంలో కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్, బ్యూటిఫుల్ కాజోల్‌లు తమ కెమిస్ట్రీతో స్క్రీన్‌పై అదరగొట్టగా.. అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే కాగా, థియేటర్స్‌లో ఎక్కువ కాలం ప్రదర్శించబడిన సినిమాగా కూడా రికార్డ్ సృష్టించింది. మరాఠా మందిర్‌లో 20 ఏళ్లు ఆడిన ఈ చిత్రం.. ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుంది.

‘దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే’ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని.. షారుఖ్, కాజోల్ కాంస్య విగ్రహాన్ని లండన్‌లో ఆవిష్కరించనున్నారు. ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’ మూవీ ట్రయల్‌లో భాగంగా లీసెస్టర్ స్క్వేర్‌లో ప్రదర్శించనున్నారు. ఆ ప్రాంతంలో కాంస్య విగ్రహంగా అమరత్వం పొందిన అనేక సినిమా క్షణాల్లో డీడీఎల్‌జే విగ్రహం ఒకటి అవుతుంది. ఆ ప్రాంతంలో కాంస్య విగ్రహం ఆవిష్కరణ ద్వారా ఎన్నో చిత్రాలు చరిత్రలో నిలిచిపోగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లో చేరనుంది DDLJ.

అన్ని తరాల ఆదరణ పొందిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమాగా ‘దిల్ వాలే దుల్హానియా లేజాయింగే’ రికార్డు సాధించగా.. బాలీవుడ్ గ్లోబల్ పాపులారిటీకి ట్రిబ్యూట్‌గా నిలవనుంది విగ్రహం. కాగా శీతాకాలంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా షారుఖ్ వైఫ్ గౌరీఖాన్.. ఈ సినిమా సీక్వెల్ చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.