- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ను యూకే ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. హువావేకు చెందిన సేవలు, పరికరాలపై నిషేధం విధించేందుకు నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లో 5జీ నెట్‌వర్క్ టెక్నాలజీని అందించడానికి హువావే కంపెనీ గత కొన్నాళ్లుగా పలు దేశాలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. యూకేలో ఉన్న హువావే పరికరాలను 2027 నాటికి తొలగించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమెరికా తాజా ఆంక్షలను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా, సైబర్ నిపుణుల సలహాల తర్వాత నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సమీక్ష అనంతరం యూకే ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ఏడాది చివరి నాటికి హువావే నుంచి 5జీ పరికరాలేవీ కొనుగోలు చేయకుండా నిషేదం ప్రకటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన యూకే డిజిటల్ మంత్రి ఒలివర్..5జీ దేశ తీరునే మారుస్తుందని నమ్ముతున్నాం. కానీ, దేశ భద్రత, మౌలిక సదుపాయాలు సరైన స్థాయిలో ఉన్నప్పుడే అని తెలిపారు.