- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, శేరిలింగంపల్లి: మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన దంపతులు రాజు, లావణ్య(40) స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరు ఆల్విన్ కాలనీ నుంచి జగద్గిరిగుట్ట వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వెనక నుండి ఒకేసారి రెండు లారీలు వచ్చాయి. అయితే, ముందు వెళ్లిన లారీ వీరి బైక్‌ను ఢీకొనడంతో భార్యాభర్తలు ఇద్దరూ రోడ్డుపై కిందపడ్డారు. ఈ క్రమంలో వెనుక నుండి వచ్చిన లారీ లావణ్య తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రాజుకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






