అక్టోబర్ 19న బీపీఈడీ ఫిజికల్ టెస్ట్

44

దిశ, తెలంగాణ బ్యూరో: అక్టోబర్ 19 నుంచి బీపీఈడీ, డీపీఈడీ అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులను నిర్వహించనున్నట్టు టీఎస్ పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. బీపీఈడీలో 2,746 మంది పురుషులు, 1,222 మహిళలు ఉన్నారు. డీపీఈడీ కోర్సు కోసం 2,053 మంది పురుషులు, 836 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ దరఖాస్తులు సమర్పించినట్టు కన్వీనర్ తెలిపారు. వచ్చేనెల 10 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఆయా కోర్సులకు సంబంధించి ఎలాంటి అదనపు రుసుం లేకుండా ఈనెల 30వరకూ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..